కాళేశ్వరం... తెలంగాణ రైతుల కళ : కేటీఆర్

Published : Apr 25, 2019, 02:02 PM IST
కాళేశ్వరం... తెలంగాణ రైతుల కళ : కేటీఆర్

సారాంశం

కాళేశ్వరం తెలంగాణ రైతులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కళ అని  తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  

కాళేశ్వరం తెలంగాణ రైతులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కళ అని  తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్ట్ మొదటి పంపు వెట్ రన్ విజయవంతమైన సంగతి తెలిసిందే.

కాగా.. దీనిపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ రైతులు ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అని కేటీఆర్ అన్నారు. కోటి ఎకరాలకు పైగా ఈ ప్రాజెక్టు నీరు అందుతుందని ఆయన అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే మైల్ స్టోన్ ఈ ప్రాజెక్టు అని కేటీఆర్ కొనియాడారు. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!