వివక్షకు గుర్తుగా సమతామూర్తి విగ్రహావిష్కరణ: బీజేపీపై కేటీఆర్ ఫైర్

Published : Feb 06, 2022, 12:39 PM ISTUpdated : Feb 06, 2022, 12:55 PM IST
వివక్షకు గుర్తుగా సమతామూర్తి విగ్రహావిష్కరణ: బీజేపీపై కేటీఆర్ ఫైర్

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ టూర్ సమయంలో కేసీఆర్ దూరంగా ఉండడంపై టీఆర్ఎస, బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. దీంతో  ఆదివారం నాడు కేటీఆర్ ఈ విషయమై స్పందించారు.

హైదరాబాద్:  వివక్షకు గుర్తుగా సమతామూర్తి విగ్రహావిష్కరణ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి, TRS  వర్కింగ్ ప్రెసిడెంట్ KTR  విమ ర్శించారు.

 

 

సమతామూర్తి విగ్రహవిష్కరణపై ట్విట్టర్ వేదికగా  ఆదివారం నాడు ఆయన స్పందించారు. సమతామూర్తి కేంద్రంలో 120 అడుగుల Ramanujacharya విగ్రహాన్ని ప్రధాని Narendra Modi శనివారం నాడు ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోడీకి KCR స్వాగతం పలకలేదు. జ్వరం వచ్చిన కారణంగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే ప్రధానికి స్వాగతం పలకకుండా కేసీఆర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని BJP విమర్శలు చేసింది. శనివారం నుండి సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నాయి.

ఈ విషయమై ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ  వివక్షకు నిలువెత్తు నిదర్శనంగా మారిందన్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వివక్షకు చిహ్నమైన వ్యక్తి  స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరించారన్నారు. సమానత్వం దూరం చేసినవాళ్లు ఈ విగ్రహవిష్కరించడం చూసి వ్యంగ్యం కూడా కొన్ని కోట్లసార్లు మరణించిందన్నారు. 

శనివారం  నుండి బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య  ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం సాగుతుంది. శనివారం నాడు ట్విట్టర్ లో ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.శనివారం నాడు  బీజేపీ నేతలు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ పై విమర్శలు చేయడంతో టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీపై అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. కేంద్రం నుండి నిధుల మంజూరుతో పాటు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయమై విమర్శలు చేశారు.

ప్రధానికి స్వాగతం పలకకపోవడం ప్రోటోకాల్ ను పట్టించుకోకపోవడమేనని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.రాజ్యాంగాన్ని మార్చాలని  కేసీఆర్ ప్రకటనను కూడా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.ఇతర రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు, తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడాన్ని టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా ట్విట్టర్ వేదికగా ప్రస్తావిస్తున్నారు. కేంద్ర సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేయకుండా కేంద్రం  వివక్షకు పాల్పడిందని కూడా  తెలంగాణ మంత్రులు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...