
హైదరాబాద్: తనపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటి రామారావు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన పప్పుగా అభివర్ణించారు.
డియర్ ఉత్తమ్ అని సంబోధిస్తూ అమెరికాలో తన ఇంట్లో తాను తన అంట్లు తోముకుని ఉంటాటనని, తమ సొంత ఇళ్లలో ప్రతి భారతీయుడి మాదిరిగానే తాను కూడా చేశానని కేటిఆర్ ట్వీట్ చేశారు.
మీ పప్పు మాదిరిగా కాకుండా పనిచేసుకుని సొంతంగా సంపాదించుకుని గౌరవంగా జీవించినందుకు గర్విస్తున్నానని ఆయన చ ెప్పారు. మీ మాదిరిగా ప్రజల డబ్బును లూటీ చేసి కారులో డబ్బులను తగులబెట్టుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు కేటీఆర్ రామారావు అమెరికాలో అంట్లు తోముకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.