పిచ్చోడి మాటలు: బండి సంజయ్ మధ్యంతర ఎన్నికల వ్యాఖ్యలపై కేటీఆర్

Published : Nov 28, 2020, 05:35 PM ISTUpdated : Nov 28, 2020, 05:36 PM IST
పిచ్చోడి మాటలు: బండి సంజయ్ మధ్యంతర ఎన్నికల వ్యాఖ్యలపై కేటీఆర్

సారాంశం

జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కూలుతుందని, మధ్యంతర ఎన్నికలు వస్తాయని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.

హైదరాబాద్: తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బిజెపి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కొట్టి పారేశారు. ఎవరో పిచ్చోడు చేసిన వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని ఆయన అన్నారు.

జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని, తెంలగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

హైదరాబాదు బిజెపి చిచ్చు పెడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బండి సంజయ్ మెంటల్.. మెంటల్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.  జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎదురుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈసారి హైదరాబాదులో సెంచరీ కొడుతామని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బిజెపి నేతలు మాట్లాడే మాటలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. 

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో కొద్ది సేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. మంత్రి తలసాని శ్రీవాస యాదవ్, ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ మాట్లాడారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతల మాటల సమరం కొనసాగుతోంది. డిసెంబర్ 1వ తేదీన జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ఘట్టం ముగుస్తుంది.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే