వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాడు ఫోన్ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇరు వర్గాలను హైద్రాబాద్ పిలిపించి మాట్లాడుతానని చెప్పారని సమాచారం. రెండు రోజుల క్రితం జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కారుపై ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు దాడికి దిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: Vikarabad జిల్లా పరిషత్ చైర్ పర్సన్ Sunitha Mahender Reddy ఎమ్మెల్యే Anand లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గురువారం నాడు ఫోన్ చేశారు. బుధవారం నాడు ZP Chair Person సునీత మహేందర్ రెడ్డి కారుపై ఆనంద్ వర్గీయులు దాడికి దిగారు. ఈ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆనంద్ పై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విమర్శలు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈజిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఆనంద్ విమర్శలు చేశారు.
ఈ నెల 13 వ తేదీన మహిళా భవన నిర్మాణానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ప్రారంబోత్సవానికి వెళ్లిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వర్గీయులు దాడికి దిగారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కారు ధ్వంసమైంది.ఈ విషయమై గురువారం నాడు సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ లు తమ వర్గీయులతో సమావేశాలు నిర్వహించారు. పరస్పరం విమర్శలు చేసుకోవాలని భావించారు. ఎమ్మెల్యే ఆనంద్ టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆనంద్ తో పాటు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డిలకు కేటీఆర్ గురువారం నాడు ఫోన్ చేసి మాట్లాడారు.మీడియా సమావేశాలు పెట్టొద్దని సూచించారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తర్వాత ఇరువురిని పిలిపించి మాట్లాడుతానని కేటీఆర్ చెప్పారు. దీంతో ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి.
undefined
also read:వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కారుపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత..
మాజీ మంత్రి పట్నం Mahender Reddy సతీమణి సునీత మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే Tandurలో స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మధ్య మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. రోహిత్ రెడ్డి వర్గీయులకు అనుకూలంగా వ్యవహరించారని పోలీస్ అధికారిని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దూషించినట్టుగా వచ్చిన ఆడియో పెద్ద ఎత్తున కలలకం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయమై మహేందర్ రెడ్డి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ ఘటన తర్వాత మరో ఘటన చోటు చేసుకొంది. ఈ దఫా మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే ఆనంద్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.
అందరిని కలుపుకుపోవాల్సిన ఎమ్మెల్యే ఆనంద్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆనంద్ పై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ విషయాలను తాను అధిష్టానం దృష్టికి తీసుకుపోతానని చెప్పారు. ఎమ్మెల్యే రౌడీయిజం చేయాలని చూస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విమర్శలను ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు కూడా ఖండించారు. ఎమ్మెలయే నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేకు తెలియకుండానే నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. తాము కూడా ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు.