మా అమ్మ డాక్టర్ చదవాలని చెప్పింది: కేటీఆర్

By pratap reddyFirst Published Dec 1, 2018, 12:46 PM IST
Highlights

శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలును పొడిగిస్తామని కేటీఆర్ తెలిపారు. శనివారం హైదరాబాదులోని మాదాపూర్‌లో జరిగిన స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

హైదరాబాద్: తమ తల్లి తనను డాక్టర్ కోర్సు చదవాలని చెప్పిందని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటీ రామారావు అన్నారు. ఏం చేయాలనే విషయంపై తనకు స్పష్టమైన అవగాహన ఉండిందని ఆయన అన్నారు. 

శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలును పొడిగిస్తామని కేటీఆర్ తెలిపారు. శనివారం హైదరాబాదులోని మాదాపూర్‌లో జరిగిన స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 

హైదరాబాద్‌లో అన్ని రకాలుగా అనుకూలమైన నగరమని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా మారిందని చెప్పారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు. విభిన్న రంగాల్లో యువతను ప్రోత్సహిస్తున్నామని, యువ పారిశ్రామికవేత్తలకు సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. 

రాష్ట్ర ఆదాయంలో 43 శాతం సంక్షేమానికి వినియోగిస్తున్నామని తెలిపారు. ఆర్థికవృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

click me!