ట్యాంక్ బండ్ మీద మంత్రి కేటీఆర్ మరో కీలకనిర్ణయం.. !

Published : Sep 07, 2021, 12:08 PM IST
ట్యాంక్ బండ్ మీద మంత్రి కేటీఆర్ మరో కీలకనిర్ణయం.. !

సారాంశం

గత ఆదివారం ట్యాంక్ బండ్ మీద నగర పౌరులు కుటుంబసభ్యులతో సందడి చేశారు.  సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేటీఆర్ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్ సాగర్ లో లేజర్‌ షో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాదులోని  ట్యాంక్ బండ్ మీద ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి  రాత్రి 10 వరకు వాహనాల రాకపోకలు నిలిపివేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

గత ఆదివారం ట్యాంక్ బండ్ మీద నగర పౌరులు కుటుంబసభ్యులతో సందడి చేశారు.  సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేటీఆర్ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్ సాగర్ లో లేజర్‌ షో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అన్ని వైపుల నుంచి వీక్షించే లా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు.  హస్తకళలు, సంగీతం, కళలకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పారు.  స్పెషల్ సీఎస్,  హెచ్ఎండిఎ కమిషనర్ అరవింద్ కుమార్  వెంటనే స్పందించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఇప్పటికే ట్యాంక్ బండ్ పై సందర్శకులకు ఆహ్లాదంగా కలిగించేలా ల్యాండ్ స్కేప్,  పచ్చదనం పెంపు కోసం చర్యలు చేపట్టామని తెలిపారు
 
PREV
click me!

Recommended Stories

Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న
Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu