సంగారెడ్డిలో మహిళా పారిశ్రామిక పార్క్‌‌ను ప్రారంభించిన కేటీఆర్

Published : Mar 08, 2022, 11:29 AM ISTUpdated : Mar 08, 2022, 12:25 PM IST
సంగారెడ్డిలో మహిళా పారిశ్రామిక పార్క్‌‌ను ప్రారంభించిన కేటీఆర్

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని సుల్తానాపూర్‌లో మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. 

సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో మ‌హిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి KTR మంగళవారం నాడు ప్రారంభించారు. అంత‌ర్జాతీయ Women day పుర‌స్క‌రించుకొని  ఈ సంద‌ర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఫ్లో Industrial Park  పైలాన్‌ను కేటీఆర్ ఆవిష్క‌రించారు.

 50 ఎక‌రాల్లో ఈ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశారు.  Ficci లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో) పార్క్‌లో మహిళా పారిశ్రామిక వేత్తలతో  మంత్రి కేటీఆర్ సమావేశమ‌య్యారు.తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రంలో అన్ని రకాల సౌకర్యాలున్నాయన్నారు.

మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హ‌బ్ అని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటైన వీ హ‌బ్‌కు సీఈవోగా దీప్తి ఉన్నారన్నారు. దీప్తిని ఈ సమావేశంలో కేటీఆర్ పరిచయం చేశారు. 

వీ హ‌బ్ సంద‌ర్శించి మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలని ఆయన సూచించారు.  వీ హ‌బ్ ఇప్ప‌టికే 2,194 స్టార్ట‌ప్‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేసిందని మంత్రి టుర్తు చేశారు. . ఇందు కోసం రూ. 66.3 కోట్ల నిధులు కేటాయిస్తున్నామ‌ని తెలిపారు. స్టార్ట‌ప్ నిధుల‌తో 2,800 మందికి ఉపాధి క‌ల్పించినట్టుగా మంత్రి తెలిపారు. 

దేశంలో తొలిసారి మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ఉద్యామిక అనే కొత్త కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. అంతేకాదు  ఫిర్యాదుల‌ను కూడా ప‌రిష్క‌రిస్తున్నామ‌ని చెప్పారు. ఉద్యామిక‌లో భాగంగా సంప్ర‌దింపుల క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ క‌మిటీ ద్వారా ప్రాసెస్, రివ్యూ, ఆర్థిక ప్రోత్సాహ‌కాలు అందిస్తున్నామ‌ని  కేటీఆర్ తెలిపారు. సుల‌భ‌త‌ర వాణిజ్యానికి కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు కావాల‌న్నారు. ప్ర‌పంచ స్థాయి ఉత్ప‌త్తుల‌తో పురోభివృద్ధి సాధించాల‌ని ఆశిస్తున్నాను అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

టీఎస్ ఐపాస్ ద్వారా ప‌రిశ్ర‌మ‌ల‌కు 15 రోజుల్లోనే అనుమ‌తి ఇస్తున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 18 వేల ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇచ్చామ‌న్నారు. ప్రైవేట్  రంగంలో ల‌క్ష‌ల‌ సంఖ్య‌లో ఉద్యోగ క‌ల్ప‌న క‌ల్పించామ‌న్నారు. ప్ర‌పంచానికి వ్యాక్సిన్లు అందించే కేంద్రంగా హైద‌రాబాద్ మారింద‌న్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్ కేర్ రంగంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. హైద‌రాబాద్ ఫార్మాస్యూటికల్ ఆఫ్ ఇండియాగా మారిందని కేటీఆర్ తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu