హుజురాబాద్ ఫలితంపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్.. ఆయన ఎమన్నారంటే..

By team teluguFirst Published Nov 2, 2021, 6:26 PM IST
Highlights

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) విజయం దాదాపు ఖరారు అయినట్టే. అయితే తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. 

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం దాదాపు ఖరారు అయినట్టే. అయితే ఈ ఎన్నిక‌ ఫలితాలపై టీఆర్‌ఎస్ అగ్ర నేతల నుంచి ఎలాంటి కామెంట్స్ వినిపించలేదు. హుజురాబాద్‌లో ప్రచారం బాధ్యతలు చూసిన మంత్రులు హరీష్ రావు, కొప్పల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ల నుంచి ఏ విధమైన ప్రకటన రాలేదు. అయితే తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. 

 

In the last 20 years TRS has seen many highs and lows & this one election result will not be of much significance or consequence

My compliments to on a spirited fight 👍

Appeal to all TRS workers to work with increased resolve to forge ahead in future battles

— KTR (@KTRTRS)

హుజురాబాద్‌లో పార్టీ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు, ప్రశంసలు తెలిపారు. టీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అలుపెరగకుండా పోరాటం చేశారని.. వారికి ధన్యవాదాలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గత 20 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ఎన్నో ఎత్తు పల్లాలను చూసిందన్న కేటీఆర్.. ఈ ఒక్క ఎన్నిక(హుజురాబాద్) ఫలితం అంతా ఇంపార్టెంట్ కాదన్నారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు భవిష్యత్ పోరాటల్లో మరింత దృఢ సంకల్పంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. 

click me!