వీపు చింతపండు అవుతుందనే..: కాంగ్రెసు, టీడీపీలపై కేటీఆర్ ఫైర్

By Nagaraju TFirst Published Sep 24, 2018, 6:39 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ తెచ్చిన ఘనత ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీదేనని చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు  అవుతుందన్న భయంతో తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు కేటీఆర్. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ తెచ్చిన ఘనత ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీదేనని చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు  అవుతుందన్న భయంతో తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు కేటీఆర్. 

తెలంగాణ రాష్ట్రాన్నిఅభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుందని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాన్నికాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టులను అడ్డుకునేందుకు 186 కేసులు వేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు సైతం తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డారని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి 30లేఖలు రాశారని ఆరోపించారు. 

తెలంగాణకు నీళ్లివ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు పార్టీతో పొత్తుపెట్టుకుంటారా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులను బలితీసుకున్న పార్టీ కాంగ్రెస్, టీడీపీలేనని తెలిపారు. హంతకపు పార్టీతో పొత్తు పెట్టుకోమని కోదండరామ్ కు ఏ అమరుడు చెప్పారని ప్రశ్నించారు. అసలు బుద్ది ఉండే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారా అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరామ్ లను ప్రశ్నించారు.  

మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాగ్ధానాలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు కేటీఆర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దపు వాగ్ధానాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ 1000 అంటే కాంగ్రెస్ పార్టీ 2000 అంటూ సాధ్యం కాని హామీలిస్తున్నారన్నారు. 

చివరకు పెళ్లి కాని యువకులు ఉంటే పెళ్లి కూడా చేస్తామంటారని...వంట రాకపోతే వంట చేస్తామని, గోరు ముద్దలు కూడా తినిపిస్తామని చెప్తారని చమత్కరించారు. ఆఖరికి పిల్లలకు డైపర్లు కూడా మారుస్తామన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్.
  

click me!