కామన్ సెన్స్ కూడా లేదు.. మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్

Published : Jan 22, 2019, 11:30 AM IST
కామన్ సెన్స్ కూడా లేదు.. మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్

సారాంశం

కామన్ సెన్స్ లేకుండా వార్తలు రాస్తున్నారంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.

కామన్ సెన్స్ లేకుండా వార్తలు రాస్తున్నారంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై ఓ పత్రిక రాసిన వార్తపై కేటీఆర్ ఈ విధంగా మండిపడుతున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే... తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం యాగం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం.. ప్రధాన మంత్రి కావాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారంటూ ఓ ఇంగ్లీష్ పత్రిక వార్తను ప్రచురించింది.

కాగా.. ఈ న్యూస్ పై ఓ నెటిజన్.. కేసీఆర్ ప్రధాని పదవి కోసం యాగాలు చేయడం లేదని.. ఇలాంటి వార్తలు నిరాధారం అంటూ ట్వీట్ చేసి.. ఆ ట్వీట్ కి కేటీఆర్ ని కూడా ట్యాగ్ చేశారు.

దీంతో.. ఆ న్యూస్ పై కేటీఆర్ కూడా స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకోకుండా.. కామన్ సెన్స్ లేకుండా వార్తలు ప్రచురిస్తున్నాయన్నారు. ఇలాంటి వార్తలను పబ్లిష్ చేయడాన్ని సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నాంటూ ట్వీట్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్