అమిత్ షా కాదు భ్రమిత్ షా.. రాహుల్ బాబా పెడితే నాశనమే: కేటీఆర్

By Arun Kumar PFirst Published Sep 16, 2018, 2:28 PM IST
Highlights

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.. సనత్ నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమిత్ షా తెలంగాణకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఆయన ఏదేదో జరిగిపోయిందని భ్రమల్లో బతుకుతూ ఉంటారని.. ఆయన పేరు అమిత్ షా కాదని.. భ్రమిత్ షా అని అన్నారు

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.. సనత్ నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమిత్ షా తెలంగాణకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఆయన ఏదేదో జరిగిపోయిందని భ్రమల్లో బతుకుతూ ఉంటారని.. ఆయన పేరు అమిత్ షా కాదని.. భ్రమిత్ షా అని అన్నారు.

అసెంబ్లీని రద్దు  చేసి టీఆర్ఎస్ తప్పు చేసిందని అమిత్  షా అంటున్నారని.. బహుశా ఆయనకు మతిమరుపు వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. నాడు 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ, 2004లో ప్రధాని వాజ్‌పేయ్ తొమ్మిది నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. ఈ పని బీజేపీ నేతలు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు.

నాలుగేళ్లలో బీజేపీ దేశప్రజలను దగా చేసిందని.. నల్లధనాన్ని వెలికి తీస్తామని.. కోటిమందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. అందరి చేతికి చీపుర్లు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ పాలనలో అచ్చేదిన్ రాలేదని.. చచ్చేదిన్ వచ్చిందని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీని నెరవేర్చుకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను బీజేపీ మోసం చేసిందని.. అది  భారతీయ జనతా పార్టీ కాదని.. భారతీయ జుంటా పార్టీ అని ఎద్దేవా చేశారు.

తెలంగాణకు రెండు లక్షల కోట్లు ఇచ్చి ఎంతో చేశామని అంటున్నారని.. అసలు రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదని ఎన్టీఆర్ ఏనాడో చెప్పారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని.. ఎన్నికలంటే వణికిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారపక్షాన్ని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా అని చూడాల్సిన ప్రతిపక్షానికి ఎన్నికలంటే వెన్నులో వణుకు పుడుతోందన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ సర్వనాశనమేనని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మంత్రి తలసాని, ఇతర నేతలు పాల్గొన్నారు.

click me!