ఓటేసి నచ్చినవారిని ఎన్నుకొండి: కేటీఆర్

Published : Dec 07, 2018, 12:22 PM IST
ఓటేసి నచ్చినవారిని ఎన్నుకొండి: కేటీఆర్

సారాంశం

ఓటేసి ప్రతి ఒక్కరూ  తమకు నచ్చిన నాయకుడిని, నచ్చిన  పార్టీని ఎన్నుకోవాలని  తెలంగాణ  అపద్ధర్మ మంత్రి కేటీఆర్ కోరారు.  


హైదరాబాద్: ఓటేసి ప్రతి ఒక్కరూ  తమకు నచ్చిన నాయకుడిని, నచ్చిన  పార్టీని ఎన్నుకోవాలని  తెలంగాణ  అపద్ధర్మ మంత్రి కేటీఆర్ కోరారు.

హైద్రాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకొన్న తర్వాత మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు.ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే తాము నడుచుకొన్నామని కేటీఆర్ చెప్పారు. రాజకీయాలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితాలను  నిర్ధేశిస్తాయని కేటీఆర్ చెప్పారు.

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మీకు నచ్చిన నాయకుడిని మీకు నచ్చిన పార్టీని ఎన్నుకోవాలని కేటీఆర్ ప్రజలను కోరారు. 

ఓటు హక్కును వినియోగించుకోకుండా భవిష్యత్తును నిర్ధేశించుకోవాలని  ఆయన  కోరారు.  కేటీఆర్ సతీమణి  శైలిమ శుక్రవారం ఉదయం పూటే  తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Flood Alert : ఈ రెండ్రోజుల్లో 400 మిమీ వర్షం కురిసే ఛాన్స్.. ఈ తెలంగాణ జిల్లాలకు పొంచివున్న వరద ముప్పు
Heavy Rains: తెలంగాణలో దంచికొడుతున్నవానలు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ