జిహెచ్ఎంసీ ఎన్నికలు 2020: ఓటేసిన మంత్రి కేటీఆర్..!

By telugu news teamFirst Published Dec 1, 2020, 8:03 AM IST
Highlights

ఓటు వేసిన అనంతరం కేసీఆర్.. మీడియాతో మాట్లాడారు. తాను హైదరాబాద్ నగర అభివృద్ధికి ఓటు వేసామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలంతా ఓటు వినియోగించుకోవాలని  కేటీఆర్.. ప్రజలను కోరారు.


జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7గంటల నుంచే ఓటింగ్ మొదలైంది.  కాగా.. బంజారాహిల్స్ లోని నందినగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ లో తమ ఓటు హక్కును కేటీఆర్ వినియోగించారు. కేసీఆర్, ఆయన భార్య శైలిమా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు వేసిన అనంతరం కేటీఆర్.. మీడియాతో మాట్లాడారు. తాను హైదరాబాద్ నగర అభివృద్ధికి ఓటు వేసామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలంతా ఓటు వినియోగించుకోవాలని  కేటీఆర్.. ప్రజలను కోరారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించాలి అనుకుంటే కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎలాంటివారు అధికారంలో ఉండాలో ఆలోచించి.. ఓటు వేయాలి అంటూ కేటీఆర్ సూచించారు. కాగా.. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్  చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది. మరోవైపు బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేలా కనపడుతోంది. దుబ్బాక ఎన్నికల సీన్ ని ఇక్కడ కూడా రిపీట్ చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!