మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం: కూతురు, భార్యను కొట్టి చంపి ఆత్మహత్యాయత్నం చేసిన భర్త

Published : May 31, 2022, 03:13 PM IST
మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం: కూతురు, భార్యను కొట్టి చంపి ఆత్మహత్యాయత్నం చేసిన భర్త

సారాంశం

కాపురానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న కూతురు సరస్వతితో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన భార్య కలమ్మసై భర్త కృష్ణయ్య రోకలిబండతో దాడికి దిగడంతో వారిద్దరూ చనిపోయాడు. ఆ తర్వాత కృష్ణయ్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ  ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకొంది. 

మహబూబ్‌నగర్: ఉమ్మడి Mahabubnagar జిల్లాలో కాపురానికి వెళ్లనన్న నవ వధువును కొట్టి చంపాడు తండ్రి, ఈ విషయమై అడ్డొచ్చిన భార్యను కూడా తీవ్రంగా మంగళవారం నాడు కొట్టాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు. ఈ విషయాన్ని బంధువులకు పోన్ చేసి చెప్పాడు. 

మహబూబ్ నగర్ జిల్లా జైనల్లీపూర్ గ్రామానికి చెందిన Krishnaiah,Kalamma దంపతుల కుమార్తె Saraswathiకి ఈ నెల 8న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. అయితే పెళ్లి జరిగిన 10 రోజుల తర్వాత నవ వధువు ఇంటికి వచ్చింది. 

అత్తారింటికి వెళ్లనని తల్లిదండ్రులకు ఆమె చెప్పింది. కాపారానికి వెళ్లాలని తండ్రి ఆమెను మందలించాడు. కూతురికి తల్లి అండగా నిలిచింది.  అయితే ఈ విషయమై ఇవాళ  కూతురికి, భార్యతో కృష్ణయ్య గొడవ పెట్టుకున్నాడు.  కూతురిని కాపురానికి పంపాలని కృష్ణయ్య పట్టుబడ్డాడు. 

అయితే ఈ విషయమ తన మాట వినడం లేదని కృష్ణయ్య కోపంతో రోకలిబండతో భార్య కలమ్మను, కూతురు సరస్వతిని కొట్టాడు. ఆ తర్వాత తాను పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని  ఫోన్ చేసి బంధువులకు చెప్పాడు. వెంటనే స్థానికులు కలమ్మ, సరస్వతిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో సరస్వతి, కలమ్మ మార్గమధ్యలోనే మరణించారు. మహబూబ్ నగర్ ఆసుపత్రిలో కృష్ణయ్య చికిత్స తీసుకుంటున్నాడు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?