జనార్ధన్ రెడ్డే ఫోన్ చేశారు, పరువు నష్టం దావా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

By narsimha lodeFirst Published Dec 10, 2018, 6:26 PM IST
Highlights

నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డే తనకు ఫోన్ చేశారని చేవేళ్ల ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.


హైదరాబాద్: నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డే తనకు ఫోన్ చేశారని చేవేళ్ల ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.ఇదే తరహలో తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.

సోమవారం నాడు గాంధీ భవన్‌లో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాట్పాప్‌‌లోనే మాట్లాడుతారని చెప్పారు. నేను  మీకు ఫోన్ చేస్తానని మర్రి జనార్ధన్ రెడ్డి తనకు ఫోన్ చేశారని చెప్పారు.మా జిల్లాలో 11 సీట్లను  కైవసం చేసుకొంటామని  మర్రి జనార్ధన్ రెడ్డి తనకు తెలిపారని చెప్పారు. వాట్సాప్ కాల్ ద్వారా తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. తాను టీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతానని చెప్పారు.

మర్రి జనార్ధన్ రెడ్డిని తాను ప్రలోభపెట్టినట్టు చేసిన ఆరోపణలను విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. నేను మర్రి జనార్ధన్ రెడ్డికి భవిష్యత్తులో కూడ ఫోన్ చేస్తానని ఆయన చెప్పారు.నాగర్ ‌కర్నూల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉందన్నారు.

మా ఇంటికి మర్రి జనార్ధన్ రెడ్డి వచ్చారని చెప్పారు. తాను కూడ వాళ్ల ఇంటికి వెళ్లానని చెప్పారు. జనార్ధన్ రెడ్డే తనకు ఫోన్ చేశారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. మర్రి జనార్ధన్ రెడ్డికి పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయని ఆయనను కొనుగోలు చేసే శక్తి లేదన్నారు.

మర్రి జనార్ధన్ రెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. గత ఎన్నికల్లో  టీఆర్ఎస్ కు 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే 90కు పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎలా పెరిగిందని  కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

నా ఫోన్ నెంబర్  కంటిన్యూ గా ఫోన్లు వచ్చినట్టు చెప్పారు.  భవిష్యత్తులో  ఇదే రకమైన ఆరోపణలు చేస్తే మర్రి జనార్ధన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలోనే చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మర్రి జనార్ధన్ రెడ్డితో వాట్పాప్ కాల్  చేసినట్టు చెప్పారు.

తాను  టీఆర్ఎస్ కు చెందిన 50 మంది టీఆర్ఎస్ అభ్యర్థులతో  మాట్లాడినట్టు చెప్పారు.సుమారు 30 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు నిరాశా నిస్పృహలతో ఉన్నారని ఆయన చెప్పారు.టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరితో మాట్లాడారని ఆయన చెప్పారు. వాట్సాప్ కాల్స్ తప్ప టీఆర్ఎస్ నేతలు ఫోన్లో మాట్లాడరని చెప్పారు.

సంబంధిత వార్తలు

చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిపై మర్రి సంచలన ఆరోపణలు

 

 

click me!