కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న భట్టి విక్రమార్కతో దిగిన ఫొటోను పోస్టు చేశారు. కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామని దాని వెనుక రాసుకున్నారు. ఈ ఫొటోలో రేవంత్ రెడ్డి లేకపోవడంపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. తాజాగా, రేవంత్ రెడ్డితో ఆయన పంచుకున్న క్షణాల తాలూకు వీడియో రూపొందించి పోస్టు చేశారు.
Revanth Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నారు. నిన్న భట్టి విక్రమార్కతో తన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామని కామెంట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పడి నెల కూడా నిండకముందే గ్రూపు రాజకీయాలు ప్రారంభం అయ్యాయా? అనే చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డిని సీనియర్లు ఇంకా యాక్సెప్ట్ చేయడం లేదా? అని వదంతులు వచ్చాయి. రేవంత్ రెడ్డిని ఇంకా జూనియర్ అనే కోణంలోనే చూస్తున్నారా? అని కామెంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితోనూ ఓ పోస్టు పెట్టారు.
తొలుత రేవంత్ రెడ్డికి దూరంగా ఉన్నప్పటికీ ఎన్నికలు సమీపించేనాటికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పంథా మార్చుకున్నారు. ఎన్నికల ముంగిట్లో రేవంత్ రెడ్డితో ఆయన సన్నిహితంగా మెలిగారు. రేవంత్ రెడ్డే సీఎం అన్నట్టుగావెంకట్‌రెడ్డి సైతం ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా వెంకట్‌రెడ్డి మారారు. రేవంత్ క్యాబినెట్‌లో మంత్రిగా ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read: TDP: ఏపీలో తెలంగాణ ట్రెండ్.. చంద్రబాబు, పవన్ రెండు స్థానాల్లో పోటీ? అల్లుడి కోసం సీటు త్యాగం!
వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.
ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.
సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే... pic.twitter.com/BPNdM4LuRZ
తాజాగా, సీఎం రేవంత్ రెడ్డితో తాను పంచుకున్న ఆత్మీయ క్షణాలను క్రోడీకరించి సలార్ పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్ చేసుకుని ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. భట్టితో కేవలం ఫొటో మాత్రమేగానీ, రేవంత్ రెడ్డితో మరింత గాఢత్వాన్నిచూపించేలా వీడియోను పోస్టు చేశారు. దానికి తోడు ఆ పాటలోని లిరిక్స్‌ను కూడా ట్వీట్‌లో రాసుకున్నారు. ‘వేగమొకడు… త్యాగమొకడు, గతము మరువని గమనమే, ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే, ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన, వెరసి ప్రళయాలే... సైగ ఒకరు… సైన్యం ఒకరు, కలిసి కదిలితే కదనమే...’ అని ఆ వీడియోకు ట్వీట్ జత చేశారు.