కార్యకర్తలు ఈరోజు నుంచే సిద్దంగా ఉండండి.. అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు: రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Nov 28, 2022, 5:48 PM IST
Highlights

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రతిపక్షాలు కూడా ఇదే మాటను చెబుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నాయి. 

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రతిపక్షాలు కూడా ఇదే మాటను చెబుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నాయి. అయితే అధికార టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని చెబుతోంది. అయినప్పటికీ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి బ్రేక్ పడటం లేదు. తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ వరకు సాధారణ ఎన్నికలకు గడువు ఉండకపోవచ్చని అన్నారు. 

ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియడానికి ఆరు నెలల ముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్, మే నెలలో కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. 

బీజేపీ కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు ఈ రోజు నుంచే సిద్దంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంతో గెలిచిందని ఆరోపించారు. 

click me!