హైదరాబాద్‌లో అర్ధరాత్రి క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. అరగంట ఆలస్యంగా వచ్చాడని..

Published : Aug 08, 2022, 10:28 AM IST
హైదరాబాద్‌లో అర్ధరాత్రి క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. అరగంట ఆలస్యంగా వచ్చాడని..

సారాంశం

హైదరాబాద్ రాజేంద్ర నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మూక రెచ్చిపోయింది. అరగంట ఆలస్యంగా వచ్చాడని.. ఓ క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. అంతేకాకుండా క్యాబ్ ఓనర్‌ను సైతం ఓ గదిలో బంధించి చితకబాదారు.

హైదరాబాద్ రాజేంద్ర నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మూక రెచ్చిపోయింది. అరగంట ఆలస్యంగా వచ్చాడని.. ఓ క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. అంతేకాకుండా క్యాబ్ ఓనర్‌ను సైతం ఓ గదిలో బంధించి చితకబాదారు. వివరాలు.. ఉప్పరపల్లికి చెందిన వినయ్ రెడ్డి శనివారం రాత్రి 11 గంటలకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. దీంతో పాతబస్తీకి చెందిన క్యాబ్ డ్రైవర్ ఫైజల్.. బుకింగ్‌ను యాక్సెప్ట్ చేసి ఉప్పరపల్లికి చేరుకున్నాడు. అయితే అరగంట ఆలస్యంగా వచ్చావంటూ ఫైజల్‌తో వినయ్ రెడ్డి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో ఫైజల్‌పై వినయ్ రెడ్డి దాడి చేశాడు. వినయ్ రెడ్డికి అతని స్నేహితులు కూడా సహకరించారు. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఫైజల్.. ఈ విషయాన్ని కారు ఓనర్‌కు చెప్పాడు. దీంతో కారు ఓనర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాడు. అయితే వినయ్ రెడ్డి, అతని స్నేహితులు.. కారు ఓనర్‌పై కూడా దాడి చేశారు. ఓ గదిలో బంధించి తీవ్రంగా గాయపరిచారు. 

ఇక, ఈ ఘటనపై బాధితులు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టుగా చెప్పారు. గాయపడిన బాధితును ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన క్యాబ్ డ్రైవర్ ఫైజల్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?