‘‘ఆయనకు టికెట్ ఇవ్వకుంటే.. నాకు కూడా వద్దు’’

Published : Nov 06, 2018, 10:34 AM IST
‘‘ఆయనకు టికెట్ ఇవ్వకుంటే.. నాకు కూడా వద్దు’’

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం సీట్ల ఎంపికలే ఇంకా తేల్చుకోలేకపోతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం సీట్ల పంపకాలే ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఓ మెలికపెట్టారు.

నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజాదారణ ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయనని ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భీష్మించుకు కూర్చున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి, తాను మునుగోడు నుంచి, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.  అధిష్టానం తమ ముగ్గురికీ ఈ స్థానాల్లో టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌