త్వరలో ఎన్నికలు... రమణ షాకింగ్ నిర్ణయం

Published : Nov 06, 2018, 10:17 AM IST
త్వరలో ఎన్నికలు... రమణ షాకింగ్ నిర్ణయం

సారాంశం

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ ఎన్నికల్లో పోటీకి రమణ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో మహాకూటమిని ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన.. ఇకనుంచి కూట మి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోతున్నారు. జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి అండగా నిలిచారు. 1994లో తొలిసారిగా జగిత్యాల నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి గెలిచిన రమణ.. అక్కడి నుంచి ఐదుసార్లు పోటీచేశారు. 1994లో మంత్రిగా పనిచేశారు. మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని రమణ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu
Agriculture : ఎకరాకు రూ.10 లక్షల లాభం..! ఇలా కదా వ్యవసాయం చేయాల్సింది, ఇది కదా రైతులకు కావాల్సింది