హరికృష్ణను గౌరవించినట్లే ఉద్యమకారులను కేసీఆర్ గౌరవించాలి: కోదండరామ్

By sivanagaprasad KodatiFirst Published Aug 31, 2018, 5:07 PM IST
Highlights

ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణను గౌరవించినట్లే.. తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి గౌరవించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్.

ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణను గౌరవించినట్లే.. తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి గౌరవించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్. టీఆర్ఎస్ పాలనలో తమకు తెలంగాణలో ఒక కుటుంబం ప్రగతి మాత్రమే కనబడుతోందని.. ప్రగతి ఇంకా ప్రగతిభవన్ దాటలేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో నంబర్‌వన్‌గా.. అవినీతిలో నెంబర్ 2గా ఉందని ఆరోపించారు. అమరుల త్యాగాలను గుర్తుకు చేస్తూ సెప్టెంబర్ 12న దీక్ష చేస్తామని తెలిపారు. దేశంలో సెక్రటేరియట్‌కు రాని ఏకైక సీఎంగా కేసీఆర్‌ను గిన్నిస్‌లోకి ఎక్కించాలని ఎద్దేవా చేశారు.

అభ్యర్థులను సమయానికి తగిన విధంగా ప్రకటిస్తామని... పొత్తులపై ఇంకా ఏమీ చెప్పలేమన్నారు. వారిది ప్రగతి నివేదన సభ.. మాది ప్రగతి ఆవేదన సభ. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 13000 పోస్టులే టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేసింది.. మరో 10 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో భర్తీ అయ్యాయి. ప్రభుత్వ పథకాలు అవినీతి మయం అయ్యాయి. ప్రగతి నివేదన సభకు రమ్మని అడిగితే ప్రజల సమస్యలను గురించి అడగాలని కోదండరామ్ జనానికి పిలుపునిచ్చారు. 
 

click me!