కోదాడలో ఉత్తమ్ సతీమణి పాదయాత్ర (వీడియో)

Published : Feb 05, 2018, 04:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కోదాడలో ఉత్తమ్ సతీమణి పాదయాత్ర (వీడియో)

సారాంశం

పాదయాత్రతో హల్ చల్ చేస్తున్న పద్మావతి ఎమ్మెల్యేకు తోడుగా కదిలిన అఖిలపక్షం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర

తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి తన నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు జనాలు భారీగా తరలివచ్చారు. కోదాడ నియోజకవర్గంలోని మోతె మండలంలో ఆమె పాదయాత్ర చేపట్టారు.

మోతె మండలానికి ఎత్తిపోతల పధకం సాధన కోసమే ప్రధాన ఎజెండాగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఉత్తమ్ పద్మావతి ప్రకటించారు. మోతె మండలంలోని చెఱువులు, కుంటలను పాలేరు, యస్.ఆర్.యస్.పి జలాలతో నింపేందుకు వత్తిడి పెంచడంలో భాగంగా ఈ యాత్ర చేసినట్లు చెబుతున్నారు.

ఈ పాదయాత్రను సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టనున్నారు. యాత్రలో వేలాదిగా రైతులు, కార్యకర్తలు, అఖిలపక్షం నాయకులు,మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీడియో కింద చూడొచ్చు.

PREV
click me!

Recommended Stories

No Bag Day: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. నెలకు ఒకరోజు నో బ్యాగ్ డే.. అసలు ఏంటిది?
Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి