కిష్టగూడెం సర్పంచ్ బహిరంగ లేఖ కలకలం: సూసైడ్ జాబితాలో మా పేరు లేకుండా చూడాలి

By narsimha lodeFirst Published Dec 3, 2020, 12:31 PM IST
Highlights

 అప్పులు తెచ్చి గ్రామాన్ని  అభివృద్ధి చేస్తే.... ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఓ సర్పంచ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ జనగామ నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తోంది.

వరంగల్: అప్పులు తెచ్చి గ్రామాన్ని  అభివృద్ధి చేస్తే.... ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఓ సర్పంచ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ జనగామ నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తోంది.

జనగామ మండలం కిష్టగూడెం సర్పంచ్ భవాని  లేఖ ప్రస్తుతం సర్వత్రా చర్చకు దారితీసింది.అప్పులు తెచ్చి అభివృద్ది చేస్తే ఆత్మహత్యలు చేసుకోవాలా అని ఆ లేఖలో ప్రశ్నించారు. రూ. 19 లక్షలతో అభివృద్ధి చేస్తే  బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బిల్లులు రాకపోవడంతో తాము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొందన్నారు. ఆత్మహత్యల జాబితాలో తమ పేరు లేకుండా చూడాలని  ఆ లేఖలో కోరారు.గ్రామాభివృద్ది కోసం తాము అప్పులు తెచ్చి ఖర్చు చేసినట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.ఈ అప్పులను తీర్చేందుకు బిల్లులు ఇంకా రాకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నట్టుగా ఆ లేఖలో సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అప్పులు తీర్చలేకపోతే తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆ లేఖలో  పేర్కొన్నారు. తాాము గ్రామాభివృద్ది కోసం చేసిన డబ్బులను తమకు ఇప్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 

click me!