ఇష్టం లేని పెళ్లి.. అల్లుడి ఇంటిపై అత్తింటివారి దాడి, సినీఫక్కీలో కూతురి కిడ్నాప్

Siva Kodati |  
Published : Nov 13, 2022, 09:42 PM IST
ఇష్టం లేని పెళ్లి.. అల్లుడి ఇంటిపై అత్తింటివారి దాడి, సినీఫక్కీలో కూతురి కిడ్నాప్

సారాంశం

జగిత్యాల జిల్లాలో ఆదివారం సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కక్షగట్టిన ఆమె తల్లిదండ్రులు.. అల్లుడి ఇంటిపై దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేశారు. 

జగిత్యాల జిల్లాలో ఆదివారం సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం పెద్దల దాకా వెళ్లగా.. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు ససేమిరా నో చెప్పేశారు. ఈ క్రమయంలో సదరు యువతి 3 నెలల క్రితం ఇంట్లో చెప్పకుండా బయట ప్రియుడిని ప్రేమ వివాహం చేసుకుంది. 

వివాహమైన నాటి నుంచి యువతి తన భర్త మధుతో కలిసి అత్తారింట్లోనే వుంటోంది. అయితే ఆదివారం యువతి కుటుంబ సభ్యులు, బంధువులు కత్తులు, గొడ్డళ్లతో మధు ఇంటి మీద పడ్డారు. మారణాయుధాలతో బెదిరిస్తూ యువతిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. దీంతో మధు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా  ఘటన సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!