Khammam: ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఆందోళనకు గురైన తోటి విద్యార్థులు ఈ విషయం ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ విద్యార్థి గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
School Student Dies With Heart stroke: ఇటీవలి కాలంలో గుండెపోటుతో కారణంగా సంభిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఆందోళనకు గురైన తోటి విద్యార్థులు ఈ విషయం ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ విద్యార్థి గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. గుండె సంబంధిత సమస్యలతోనే చనిపోయాడని వైద్యులు తెలిపారు. జిల్లాలోని ఎన్‌ఎస్‌పీ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మాదాసి రాజేష్ అనే విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. రాజేష్ బుధవారం స్కూల్‌కు వెళ్లగా, క్లాస్ రూమ్ లో ఒక్కసారిగా గా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. పక్కనే ఉన్న తోటి విద్యార్థులు భయాందోళనకు గురై.. వెంటనే టీచర్లకు చెప్పారు.
అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే రాజేష్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే విషాదం చోటుచేసుకుంది. రాజేష్ ప్రాణాలు కోల్పోయాడనీ, అతని మృతికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. రాజేష్ మరణం గురించి సమీప బంధువులు మాట్లాడుతూ అతనికి పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉందని తెలిపారు. దీనికి తోడు గత కొన్ని రోజులుగా నీరసంగా, అనారోగ్యంగా కనిపిస్తున్నాడు. మూడు రోజులుగా బడికి వెళ్లకుండా ఉన్న రాజేష్.. బుధవారం స్కూల్ కు వెళ్లి అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.