ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనుకున్న సమయానికే పూర్తయ్యింది. ఆ తరువాత మిగతా విగ్రహాల నిమజ్జనం మొదలవ్వనుంది.
ఖైరతాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది. ఎప్పుడూ లేనంత తొందరగా ఈ యేడు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది. దీనికోసం ఉదయం 5గంటలకే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం సన్నాహాలు ఏర్పాటు చేశారు. దీంతో.. బై బై గణేశా అనే నినాదాలతో ఎన్టీఆర్ మార్గ్ మారుమోగిపోయింది. ఎన్టీఆర్ మార్గంలోని క్రేన్ నెం.4 దగ్గర వినాయకుడి నిమజ్జనం జరిగింది.
వినాయకుడిని చివరిసారిగా చూడడానికి క్రేన్ నెం.4 దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం పొగయ్యారు. 63 అడుగుల ఎత్తైన విగ్రహం ఎట్టకేలకు అనుకున్న సమయానికే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిమజ్జనం పూర్తయింది. ప్రతీసారి రాజధానిలోని అన్ని విగ్రహాలు అయిన తరువాత ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగేది. కానీ ఈ సారి మహాగణపతి నిమజ్జనం తరువాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని ప్రకటించారు.
ఈ మేరకే ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఉపయోగించిన క్రేన్ ను తొలగించడానికి మరో గంటనుంచి గంటన్నర సమయం పడుతుంది. ఆ తరువాత వరుసగా వందలాది వినాయకులు నిమజ్జనం కానున్నారు.