చంచల్ గుడా జైల్లో కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య

By telugu teamFirst Published Oct 14, 2020, 8:30 AM IST
Highlights

కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్ గుడా జైలులో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్: కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కిన కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదులోని చంచల్ గుడా జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిపై ఏసీబీ ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసింది. 

మంగవాళంనాడు రెండో కేసులో అరెస్టు చేసి నాగరాజును జైలుకు తరలించారు. దాదాపు వంద ఎకరాలను నాగరాజు ల్యాండ్ మాఫియాకు అప్పగించాడు. నాగరాజు అవినీతిపై నెల రోజులుగా ఏసీబీ విచారణ సాగుతోంది. భూవివాదంలో ఎన్వోసీ ఇవ్వడానికి నాగరాజు కోటీ పది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు.

Also Read: దిమ్మతిరిగే అస్తులు కూడబెట్టిన కీసర ఎమ్మార్వో నాగరాజు

నాగరాజు అవినీతిపై నెల రోజులుగా ఏసీబీ విచారణ సాగుతోంది. భూవివాదంలో ఎన్వోసీ ఇవ్వడానికి నాగరాజు కోటీ పది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు నాగరాజును ఏసీబీ అధికారులు పలుమార్లు విచారించారు.

నాగరాజు డిప్రెషన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నాగరాజు దాదాపు వంద కోట్ల అక్రమాస్తులను నాగరాజు కూడబెట్టినట్లు తెలుస్తోంది. భార్యతో నాగరాజుకు వివాదం ఉందని భావిస్తున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

click me!