ఒకే ఫ్రేములో కేసీఆర్, రేవంత్: చేతిలో చెయ్యేసి.... చూడడానికి రెండు కళ్ళు చాలవు

By telugu team  |  First Published Feb 8, 2020, 10:52 AM IST

ఇంతకీ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎక్కడ కలిశారు అంటే... నిన్నటి హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ కారిడార్ ప్రారంభోత్సవంలో. నిన్న హైదరాబాద్ మెట్రో రైలులో జె బి ఎస్ నుంచి ఇమ్లిబన్ వరకు నూతన లైన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 


హైదరాబాద్: తెలంగాణ లో తెరాస కు ఎవరన్నా కొరకరాని కొయ్యగా ఉన్న నాయకుడు ఉన్నదంటే అది ఖచ్చితంగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయనను 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను ఓడించడానికి సర్వశక్తులను తెరాస ఒడ్డింది. 

హరీష్ రావు సహా ఇతర కీలక నేతలంతా అక్కడే క్యాంపు వేసుకొని కూర్చొని ఆయన్ను ఓడించారు. ఇంతలా ఉప్పు నిప్పుగా ఉండే ఈ ఇరు పార్టీల నేతలు నిన్న ఒకటే ఫ్రేములో కనిపించేసరికి తెలంగాణ ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. 

Latest Videos

undefined

ఇంతకీ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎక్కడ కలిశారు అంటే... నిన్నటి హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ కారిడార్ ప్రారంభోత్సవంలో. నిన్న హైదరాబాద్ మెట్రో రైలులో జె బి ఎస్ నుంచి ఇమ్లిబన్ వరకు నూతన లైన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 

ఈ నూతన లైన్ ఓపెనింగ్ కి ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్యఅతిధిగా హాజరయి, ఆయన చేతుల మీదుగా ఆ లైన్ ప్రారంభమయింది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ అయినా రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇలా ఇద్దరు నేతలు ఒకటే ఫ్రేములో దర్శనమిచ్చారు. 

Also read: జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభం: హైద్రాబాద్ రికార్డు ఇదీ

ఇక ఆ ఫొటోలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... మాజీ ఎక్సయిజ్ శాఖ మంత్రి పద్మ రావు గౌడ్, రేవంత్ రెడ్డి ఇద్దరు చేతిలో చేయి వేసుకొని కనిపించరు. వారు చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఇలా అందరూ నేతలు అక్కడ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడంతో అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. 

2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డిని ఓడించడానికి తెరాస తీవ్ర ప్రయత్నాలు చేసినా కూడా రేవంత్ విజయ దుందుభి మోగించాడు. 

ఇక ఈ మెట్రో లైన్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 11 కి.మీ దూరం ఉన్న  ఈ ప్రాంతాన్ని 16 నిమిషాల్లో చేరుకోవచ్చు.దేశంలోనే రెండో అతి పెద్ద కారిడార్‌గా  తెలంగాణ మెట్రో రికార్డును సృష్టించింది. ఈ రైలును ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు ఈ రైలులో ప్రయాణించారు. 

ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్ల మధ్య 9 స్టేషన్లు ఉంటాయి. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మీదుగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కు మెట్రో రైలు చేరుకొంటుంది.

దేశంలోనే అతిపెద్ద ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌గా ఎంజీబీఎస్ ను సిద్దం చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలను కలుపుతూ ఈ రైలు మార్గం ప్రజలకు సేవలను అందించనుంది.

ఈ రైలు మార్గం కోసం 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తిస్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్‌తో స్టేషన్‌ను నిర్మించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించే కారిడార్-1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్ కింది అంతస్తుల ద్వారా ప్రయాణిస్తాయి.

కారిడార్2 జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో సాగించే రైలు పైఅంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. ఐతే ఒక మార్గం నుంచి మరో మార్గం మారడానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ , కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కాంకర్స్ లెవెల్‌లో నిర్మించారు.

140 మీటర్ల పొడవుతో 60 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ మూసీనది భాగంలో నిర్మించబడి ప్రత్యేకతగా నిలుస్తున్నది.
రెండు వైపులా రాకపోకలు సాగించే విధంగా దీనిని నిర్మించారు. 

ఈ స్టేషన్ నుంచి ఒక వైపున ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌లో నేరుగా ప్రయాణికులు దిగేందుకు వీలుండగా, మరోమార్గం మూసీ నదిదాటుతూ చాదర్‌ఘట్ వైపు స్టేషన్ నుంచి దిగేలా ఏర్పాట్లు చేశారు. వీటి కోసం రెండు స్కైవేలను నిర్మాణంలో ఉన్నాయి. 

మెట్రోస్టేషన్ నుంచి చాదర్‌ఘట్ వైపు నిర్మించే స్కైవాక్ అతిపెద్దదిగా ఉంటుంది. 600 అడుగుల పొడవుతో 20 అడుగుల వెడల్పుతో దీనిని నిర్మిస్తున్నారు. 

ఈ మార్గంలో వారసత్వ నిర్మాణాలతో సమానంగా 5 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించగా ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ కూడా దీనిలోభాగం కానుంది. అందులోభాగంగా అసెంబ్లీ, ఎంజీబీఎస్, నాంపల్లి, ఎంజే మార్కెట్, జాంబాగ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, రంగ్‌మహల్ ఏరియాలు హెరిటేజ్‌లుక్‌ను సంతరించుకోనున్నాయి. 

click me!