తొలగిన అడ్డంకి: మంత్రివర్గ విస్తరణకు ఓకే

By narsimha lodeFirst Published Jan 3, 2019, 8:15 PM IST
Highlights

మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం కుదిరే అవకాశం కన్పిస్తోంది. పంచాయితీరాజ్ ఎన్నికలకు మంత్రివర్త విస్తరణకు సంబంధం లేదని  సీఎంఓ అధికారులు తేల్చి చెప్పారు. 


హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం కుదిరే అవకాశం కన్పిస్తోంది. పంచాయితీరాజ్ ఎన్నికలకు మంత్రివర్త విస్తరణకు సంబంధం లేదని  సీఎంఓ అధికారులు తేల్చి చెప్పారు. దరిమిలా త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందనే ఆశావాహులు సంతోషంతో ఉన్నారు.

 గ్రామ పంచాయితీ ఎన్నికల కోడ్ కారణంగా మంత్రివర్గ విస్తరణ చేయకూడదని ఎన్నీకల సంఘం కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై సీఎంఓ అధికారులు అధ్యయనం చేశారు. దీంతో సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమమైందని చెబుతున్నారు.

రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికలు మూడు విడతలుగా  నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్  అమల్లోకి వచ్చిన నేపథ్యంలో  మంత్రివర్గ విస్తరణ చేయడానికి వీల్లేదని ప్రకటించింది.

అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు అనుమతి తీసుకోవాలని  ఎన్నికల సంఘం కమిషనర్  నాగిరెడ్డి ప్రకటించారు. ఈ విషయమై సీఎంఓ అధికారులు పంచాయితీ రాజ్ చట్టాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేయవచ్చో.. చేయకూడదో అనే అంశంపై  అధికారులు అధ్యయనం చేశారు. మంత్రి విస్తరణ చేసుకోవడానికి ఇబ్బందులు లేవని  తేల్చి చెప్పారు.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూడ ఇబ్బందులు లేవని తేల్చేశారు.  మంత్రివర్గ విస్తరణకు ఎన్నికల కోడ్  సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీంతో మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నారు.

సంక్రాంతి తర్వాత లేదా మంచి ముహుర్తం ఎప్పుడు ఉంటే  ఆ సమయంలో  మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. మరో వైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడ  ఎన్నికల కోడ్  అడ్డంకి కాదని సీఎంఓ అధికారులు తేల్చి చెప్పారు.

కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణం చేయలేదు. దీంతో  అసెంబ్లీ సమావేశం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలోనే అసెంబ్లీ సమావేశం కూడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణకు కోడ్ ఇబ్బంది తొలగిపోవడంతో  ఆశవాహులు సంతోషంతో ఉన్నారు.

సంబంధిత వార్తలు

కేబినెట్‌లో బెర్త్ ఖాయం:ఆ నేతలకు కేసీఆర్ హామీ?

ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఆ ఎనిమిది మంది వీరే

ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

ఈ సారైనా ఆ నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కేనా

click me!