జగన్‌‌కు ఫోన్: కేసీఆర్‌ ఆకాంక్ష ఇదే

Published : May 23, 2019, 01:12 PM IST
జగన్‌‌కు ఫోన్: కేసీఆర్‌ ఆకాంక్ష ఇదే

సారాంశం

ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌  ఫోన్ చేశారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడం పట్ల కేసీఆర్ జగన్‌ను అభినందించారు.


హైదరాబాద్: ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌  ఫోన్ చేశారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడం పట్ల కేసీఆర్ జగన్‌ను అభినందించారు.

ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అద్భుత విజయం సాధించడంపై కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ రాష్ట్రం ముందడుగు వేస్తోందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగు అవుతాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరో వైపు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఘన విజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అభినందనలు తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్