ఫెడరల్ ఫ్రంట్: సీతారాం ఏచూరితో కేసీఆర్ చర్చలు

By narsimha lodeFirst Published May 12, 2019, 3:56 PM IST
Highlights

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల సమావేశమయ్యారు. అయితే విజయన్‌తో సమావేశం కావడానికి ముందే తెలంగాణ సీఎం కేసీఆర్ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో  చర్చించారు.


న్యూఢిల్లీ: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల సమావేశమయ్యారు. అయితే విజయన్‌తో సమావేశం కావడానికి ముందే తెలంగాణ సీఎం కేసీఆర్ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో  చర్చించారు.

దేశంలో  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ప్రాంతీయ పార్టీల అధినేతలు, ఆయా ప్రాంతీయ పార్టీల నేతృత్వంలోని ముఖ్యమంత్రులను కూడ కేసీఆర్ కలుస్తున్నారు.

వారం రోజుల క్రితం కేరళ సీఎం విజయన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించారు. అయితే కేరళ సీఎం విజయన్‌తో సమావేశం కావడానికి ముందు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చర్చించారు.దేశంలో  కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు విషయమై చర్చించారు.

అయితే ఎన్నికల ఫలితాల తర్వాతే  ఈ విషయమై ఓ స్పష్టత వస్తోందని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి.ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం లేదా కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీయేతర పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సీపీఎం నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో  ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని  ఏచూరి అభిప్రాయపడ్డారు.

click me!