బాల్క సుమన్ ఫ్యామిలీకి కేసీఆర్ పరామర్శ: సురేష్‌కి నివాళులు

Published : Jun 09, 2021, 04:39 PM ISTUpdated : Jun 09, 2021, 05:04 PM IST
బాల్క సుమన్ ఫ్యామిలీకి కేసీఆర్ పరామర్శ: సురేష్‌కి నివాళులు

సారాంశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్  కుటుంబ సభ్యులను తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు పరామర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్  కుటుంబ సభ్యులను తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు పరామర్శించారు.బాల్క సుమన్ తండ్రి సురేష్ కరోనాతో ఇటీవల మరణించారు.  సుమన్ తండ్రి చనిపోయిన విషయం తెలుసుకొన్న ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు  ఇటీవలే ఆయనను పరామర్శించారు. గత నెల 28వ తేదీన సుమన్ తండ్రి సురేష్ కరోనాతోహైద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో   చికిత్స పొందుతూ మరణించాడు.

మూడు రోజుల క్రితం కేటీఆర్ సహా జిల్లాకు చెందిన మంత్రులు పార్టీ ముఖ్యులు సుమన్ ను పరామర్శించారు. బుధవారం నాడు సీఎం కేసీఆర్ మెట్‌పల్లిలో సుమన్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. బాల్క సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ కు సుమన్ తన కుటుంబసభ్యులను పరిచయం చేశారు. సురేష్ మరణంతో  ధైర్యం కోల్పోవద్దని సుమన్ కుటుంబసభ్యులకు సీఎం ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు  పార్టీ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రాలను సీఎం స్వీకరించారు.

 

PREV
click me!

Recommended Stories

TGSRTC: సంక్రాంతి పండుగకు ఉచిత బస్సు స‌దుపాయం ఉంటుందా.? ఇదిగో క్లారిటీ..
Telangana: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా.?