కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో కేసీఆర్ దంపతుల పూజలు

Published : Jan 19, 2021, 11:36 AM IST
కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో కేసీఆర్ దంపతుల పూజలు

సారాంశం

 తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ఉదయం కాళేశ్వరానికి చేరుకొన్నారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో  కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ఉదయం కాళేశ్వరానికి చేరుకొన్నారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో  కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత సీఎం కేసీఆర్ మేడిగడ్డ రిజర్వాయర్ ను పరిశీలించనున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు ఎంత, ఎగువ నుండి వస్తున్న నీరు ఎంత రోజుకు ఎన్ని టీఎంసీల నీరు పంపింగ్ చేయవచ్చనే విషయమై సీఎం అధికారులతో చర్చించనున్నారు.

వేసవి కాలంలో  పంటలకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా విషయమై తీసుకోవాల్సిన  చర్యలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించనున్నారు.  మేడిగడ్డ రిజర్వాయర్ తర్వాత లక్ష్మీ బ్యారేజీని సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు.

మంగళవారం నాడు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ కాళేశ్వరం చేరుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?