యువకుడి ఒళ్లో యువతి... పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Jan 19, 2021, 11:31 AM IST
యువకుడి ఒళ్లో యువతి... పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

సారాంశం

కలిసి జీవించలేకపోతున్నాం  కనీసం కలిసి చద్దామని భావించారో ఏమోగానీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది.  

ఆదిలాబాద్: వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కూలాలు ఒకటే కాబట్టి పెద్దలు కూడా తమ ప్రేమను అంగీకరిస్తారని భావించి పెళ్లికి సిద్దమయ్యారు. అయితే ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈ ప్రేమ జంట దారుణ నిర్ణయం తీసుుకున్నారు. కలిసి జీవించలేకపోతున్నాం  కనీసం కలిసి చద్దామని భావించారో ఏమోగానీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దెగామ గ్రామానికి చెందిన యువకుడు గోడెం శ్రీరామ్‌ అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు కూడా ఒకటే కావడంతో పెళ్లి చేసుకుందామని భావించారు. ఇందుకోసం తమ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలిపారు.

అయితే వారు అనుకున్నట్లుగా పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకుండా అడ్డుచెప్పారు.  దీంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేక, విడిపోయి జీవించలేక తీవ్ర మనోవేధనకు గురయ్యారు. దీంతో కలిసి చద్దామన్న దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే యువకుడు అక్కడికక్కడే చనిపోగా యువతి కొన ఊపిరితో వుండగా గుర్తించినవారు ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న యువతి ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆమె యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ ఆత్మహత్యలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?