వీఆర్వోలకు భరోసా: కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టిన కేసీఆర్

By telugu teamFirst Published Sep 9, 2020, 12:30 PM IST
Highlights

కొత్త రెవెన్యూ చట్టం బిల్లును తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. వీఆర్వోల ఉద్యోగులకు భద్రత ఉంటుందని, వారిని సమాన స్థాయి ఉద్యోగాలకు బదిలీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

హైదరాబాద్: వీఆర్వోలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. వారికి తగిన న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. నూతన రెవెన్యూ చట్టం బిల్లును ఆనయ బుధవారం శాసనసభలో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీఆర్వోలను సమాన స్థాయి ఉద్యోగాలకు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. 

ఇప్పటికే వీఆర్వోల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. వారిని నుంచి రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిని స్కేల్ ఉద్యోగులుగానే పరిగణిస్తామని కేసీఆర్ చెప్పారు. 5485 మది విఆర్వోలు  ఉన్నారని, వారి ఉద్యోగులు పోవని, వారికి ఉద్యోగ భద్రత ఉంటుందని ఆయన చెప్పారు. 

తాహిసిల్దార్ స్థాయి నుంచి ఉద్యోగులు ఉంటారని ఆయన అన్నారు. వారి అధికారాలు మాత్రం పోతాయని ఆయన అన్నారు. చట్ట పరిధిలో వారు పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రెవెన్యూ కోర్టులు ఉండవని ఆయన చెప్పారు. 99.9 శాతం వివాదాలు తొలగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలోని మొత్తం భూమిని సర్వే చేస్తామని కేసీఆర్ చెప్పారు. పక్కవాళ్లు ఇతరుల భూమిపై అక్రమాలు చేయవద్దని ఆయన చెప్పారు. ఇంచు భూమి కూడా ఇతరులది అక్రమించకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గెట్టు పంచాయతీలు పూర్తిగా ముగిసిపోతాయని ఆయన చెప్పారు. 

రెవెన్యూ సంస్కరణల వల్ల ఉద్యోగులకు ఏ విధమైన సమస్య కూడా ఉండదని ఆయన అన్నారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు ఇబ్బందులు తొలుగుతాయని ఆయన చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గత మూడేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

click me!