ప్రజలపై పన్నుల భారం, కరెంట్ చార్జీల మోత: కేసీఆర్

Published : Mar 13, 2020, 12:25 PM IST
ప్రజలపై పన్నుల భారం, కరెంట్ చార్జీల మోత: కేసీఆర్

సారాంశం

రాష్ట్రంలో పన్నులను పెంచబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శాసనసభలో చెప్పారు. కరెంట్ చార్జీలు కూడా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. కరెంట్ చార్జీలు పెంచకపోతే సంస్థ మనుగడ సాగించలేదని అన్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో పన్నులు పెంచబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకేతాలు ఇచ్చారు. అందరికీ చెప్పే పన్నులు పెంచబోతున్నట్లు ఆయన శుక్రవారం శాసనసభలో చెప్పారు. కరెంట్ చార్జీలు కూడా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. చార్జీలు పెంచకపోతే సంస్థ మనుగడ సాధ్యం కాదని ఆయన తెల్చి చెప్పారు. 

పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినతరం చేస్తామని కేసీఆర్ చెప్పారు .గిరిజనుల సెంటిమెంట్లను గౌరవిస్తున్నామని, గ్రామపంచాతీయలకు క్రమంగా నిధులు విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు. 3 వేలకు పైగా గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని ఆయన అన్ారు. గ్రామకార్యదర్శుల సంఖ్య పెంచినట్లు ఆయన తెలిపారు. 

పరిపాలనలో జావాబుదారీతనం పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని గ్రీన్ తెలంగాణగా మారుస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులకు కూడా నిబంధనలు ఉన్నయని, వాటి పరిధిలోనే వారు పనిచేయాలని, గ్రామ సర్పంచ్ లు అందుకు మినహాయింపు కాదని, గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ లు పనిచేయాలని ఆయన అన్నారు. 

గ్రామ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తామని, గ్రామాల అభివృద్ధికి చాలా మంది విరాళాలు ఇచ్చారని, వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. పల్లె ప్రగతి ద్వారా తెలంగాణ గ్రామీణ వ్యవస్థ పూర్తిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యయకత్ం చేశారు. 

అన్ని గ్రామాల్లో సామూహిక దహనవాటికలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. లేఅవుట్లకు కలెక్టర్లు అనుమతులు ఇస్తారని ఆయన చెప్పారు. మౌలిక వసతులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు