న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారంనాడు ప్రారంభించారు. న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కేసీఆర్ ఇవాళ హైద్రాబాద్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి నేరుగా బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుండి బీఆర్ఎస్ నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు
. నిర్ణీత ముహుర్తం 01:05 నిమిషాలకు కేసీఆర్ బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలోని తన చాంబర్ లో కేసీఆర్ ఆసీనులయ్యారు. పార్టీకి చెందిన కార్యక్రమాలకు సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలు, సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
మొత్తం 11 వేల చదరపు అడుగుల్లో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్ లో కేసీఆర్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ చాంబర్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్ నిర్మించారు
లోయర్ గ్రౌండ్ ఫ్టోర్ లో మీడియా హాల్, సర్వెంట్స్ కొరకు క్వార్టర్స్ నిర్మించారు .గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్ ,రిసెప్షన్ , నలుగురు ప్రధాన కార్యదర్శుల ఛాంబర్ లను ఏర్పాటు చేశారు. 2,3 వ అంతస్తులో మొత్తం 20 రూమ్స్ నిర్మించారు. ఇందులో బీఆర్ఎస్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లకు ప్రత్యేకమైన రూమ్ లున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు.