నిధుల్లేవు: కేసీఆర్ రైతు బంధు పథకానికి తూట్లు

By telugu teamFirst Published Aug 25, 2019, 11:23 AM IST
Highlights

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రైతు బంధు పథకం కింద కొంత మంది రైతులకు మాత్రమే సొమ్ములు ముట్టాయి. ఇంకా పది లక్షల మంది రైతులకు రూ.2,500 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. జూన్ లోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కుంటోంది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం నిధుల కొరతను ఎదుర్కుంటోంది. లక్ష రూపాయల మేర రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపు, సొంతింటి నిర్మాణఆనికి సబ్సిడీ, నిరుద్యోగి భృతి వంటి ఎన్నికల హామీలను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇచ్చింది. వాటితో పాటు రైతు బంధు పథకం కూడా ఉంది. ఆ పథకాలను అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వ ఖజానా ఉంది. 

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రైతు బంధు పథకం కింద కొంత మంది రైతులకు మాత్రమే సొమ్ములు ముట్టాయి. ఇంకా పది లక్షల మంది రైతులకు రూ.2,500 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. జూన్ లోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. దీనికి ముందే ఆ డబ్బులు చెల్లించాల్సి ఉండింది. 

కేసీఆర్ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో రైతు బంధు పథకానికి రూ.13 వేల కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు 53 లక్షల మంది రైతులకు 6,900 కోట్ల రూపాయలు చెల్లించారు. మరో పది లక్షల మందికి చెల్లించడానికి ఆర్థిక శాఖ నుంచి వ్యవసాయ శాఖకు నిధులు విడుదల కావాల్సి ఉంది.  చిన్న కమతాలు ఉన్న రైతుల ఖాతాలకు డబ్బులు జమచేసి పెద్ద కమతాల రైతులకు చెల్లించలేదని తెలుస్తోంది.

లక్ష రూపాయల రైతు రుణమాఫీకి ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. తొలి విడత అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పథకం అమలుకు టీఆర్ఎస్ ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ పథకం అమలుకు ఈసారి రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 8 నెలలవుతోంది. ఇప్పటి వరకు ఈ పథకం అమలు ప్రారంభం కాలేదు. 

ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసింది. దానికి వయోపరిమితిని కూడా 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు పెంచుతామని చెప్పింది. దాంతో దాదాపు 40 లక్షల మందికి లబ్ధిదారులు పెరిగారు. దాదాపు 15 లక్షల మంది కొత్త లబ్దిదారులు అదనంగా చేరారు. ఈ పథకం కూడా సరిగా అమలు కావడం లేదు.

click me!