కేసీఆర్ మగాడ్రా బుజ్జి

By Arun Kumar PFirst Published Dec 12, 2018, 6:30 PM IST
Highlights

తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన సత్తా ఎంటో చాటుకున్నారు. కాంగ్రెస్, బిజెపిలు జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, సినీ నటులతో ప్రచారం చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఇక మహా కూటమి తరపున ఏపి ముఖ్యమంత్రి ఇక్కడే మకాం వేసి ప్రచారం చేసినా గెలిపించుకోలేక పోయారు. కానీ టీఆర్ఎస్ తరపున కేసీఆర్ ఒక్కడే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి చివరకు ఫలితాన్ని రాబట్టారు. దీంతో ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. 

కేసీఆర్ కు తెలంగాణలో ఇప్పటికే చాలా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ప్రసంగాలు, ప్రత్యర్థులపై  విసిరే సెటైర్లు, రాజకీయ  చతురతతో తీసుకునే నిర్ణయాలే కేసీఆర్ ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజా  గెలుపుతో ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అభిమానులు పెరిగిపోయారు. 

చంద్రబాబు ను వ్యతిరేకించే వర్గాలు మొత్తం ఇప్పుడు కేసీఆర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెంలో అయితే ఏకంగా కేసీఆర్ ను అభినందిస్తూ ప్లెక్లీలు వెలిశాయి. తెలంగాణలో ప్రత్యర్థులను మట్టికరిపించిన కేసిఆర్ ను ఉద్దేశిస్తూ ''ఆడు మగాడ్రా బుజ్జీ'' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఎన్నికల సమయంలో రాయల సీమ కు చెందిన కొన్ని సంఘాలు కేసీఆర్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాల అనంతరం ఆంధ్రా ప్రాంతంలో అభిమానులు తయారవడంపై రాజకీయంగానే కాదు సామాన్యుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. 
 
click me!