టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య రాజీనామా...

By Arun Kumar PFirst Published Nov 22, 2018, 2:47 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ జరుగుతోంది. అయితే ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించకుండా దాఖలైన చాలా నామినేషన్లను ఈసీ అధికారుల తిరస్కరించారు. ఈ గండం నుండి తప్పించుకునేందుకు మహాకూటమి అభ్యర్థి, టిడిపి నాయకులు సండ్ర వెంకట వీరయ్య కూడా తన నామినేటెడ్ పదవికి రాజీనామా చేశారు.   

తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ జరుగుతోంది. అయితే ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించకుండా దాఖలైన చాలా నామినేషన్లను ఈసీ అధికారులు తిరస్కరించారు. ఇలా నిబంధనల వల్ల పోటీకి దూరం కాకుండా ఉండటానికి పలువరు టీఆర్ఎస్ నాయకులు తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహాకూటమి అభ్యర్థి, టిడిపి నాయకులు సండ్ర వెంకట వీరయ్య కూడా తన నామినేటెడ్ పదవికి రాజీనామా చేశారు. 

తెలంగాణ తెలుగు దేశం లో కీలక నాయకుడైన సండ్ర వెంకట వీరయ్య ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపత్తి నియోజకవర్గం నుండి ఫోటీ చేస్తున్నారు. అయితే అతడు ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థాన(టిటిడి) బోర్డు మెంబర్ పదవిలో ఉన్నారు. ఇలా నామినేటెడ్ పదవిలో వున్నందున తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం వుందని భావించిన సండ్ర టిటిడి పదవికి రాజీనామా చేశారు.  

సండ్ర రాజీనామాను టిటిడి బోర్డు కూడా వెంటనే ఆమోదించింది. దీంతో అతడు టిడిపి బోర్డు అధికారికంగా తప్పుకోవడంతో నామినేషన్ తిరస్కరణ గండం నుంచి బైటపడ్డారు.   
 

click me!