అందరూ సీఎంలు దొబ్బితిన్నారు.. ఎన్టీఆర్‌ కూడా: కేసీఆర్

By sivanagaprasad kodatiFirst Published Nov 28, 2018, 1:07 PM IST
Highlights

ఉమ్మడి రాష్ట్రంలో నిధులను అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లో కూర్చొని తినేశారన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. 

ఎన్టీఆర్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు పేదల పక్కా ఇంటి నిర్మాణంలో నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్నారు ముఖ్యమంత్రి. తాను, పోచారం నాడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి దూకామని కేసీఆర్ గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే నిజాంసాగర్ ఎన్నటికీ ఎండిపోదని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేసీఆర్ ఉండగా కరెంట్ పోవడమన్నది జరగదని సీఎం హామీ ఇచ్చారు. నిజామాబాద్ సభలో నరేంద్రమోడీ ప్రధాని హోదాలో చిల్లర మాటలు మాట్లారని.. ఆయన హోదాకు అలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ సరఫరా కావాలంటే ఎమ్మెల్యేలతో పైరవీలు చేయించాల్సి  వచ్చేదని కేసీఆర్ గుర్తుచేశారు. బాన్స్‌వాడ నుంచి నర్సాపూర్ వరకు టీఆర్ఎస్‌ గాలి స్పష్టంగా కనిపిస్తోందని సీఎం అన్నారు. ప్రధాని సభకు పట్టుమని 15 వేల మంది కూడా రాలేదని.. అలాంటి చోట మోడీ తెలంగాణలో అభివృద్ధి గురించి తెలిసి తెలియక మాట్లాడారని కేసీఆర్ మండిపడ్డారు. 
 
click me!