జీయర్ స్వామితో నాకు గ్యాప్ ఉందని ఎవరు చెప్పారు: కేసీఆర్

Published : Mar 21, 2022, 07:54 PM IST
జీయర్ స్వామితో నాకు గ్యాప్ ఉందని ఎవరు చెప్పారు: కేసీఆర్

సారాంశం

చిన్నజీయర్ స్వామితో తనకు గ్యాప్ ఉందని ఎవరు చెప్పారని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇవాళ టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్: చినజీయర్‌తో తనకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

సోమవారం నాడు టీఆర్ఎస్ శాసనసభపక్షం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో KCR మీడియాతో మాట్లాడారు.  Chinnajeeyarతో తనకి  మధ్య అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దన్నారు. నీకు ఉన్న గ్యాస్ ను తమ మధ్య గ్యాప్ సృష్టించే ప్రయత్నం చేయవద్దన్నారు. తమ మధ్య గ్యాప్ ఉందని మీకు ఎవరు చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. 

ఇటీవలనే ఇదే విషయమై చిన్నజీయర్ స్వామి కూడా స్పందించారు. ఎవరైనా ఏదైనా పని అప్పగిస్తే దాన్ని చిత్తశుద్దితో చేస్తానన్నారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి తనకు ఆహ్వానం అందితే వెళ్తానన్నారు. ఆహ్వానం అందకపోతే తాను వెళ్లనన్నారు. ఎవరితోనూ పూసుకు తిరగాల్సిన అవసరం లేదని  ఆయన అభిప్రాయపడ్డారు.

సీఎం కేసీఆర్‌కి  జీయర్ స్వామికి  మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. ముచ్చింతల్‌లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ముచ్చింతల్ కార్యక్రమానికి ముందు నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం కూడా లేకపోలేదు.  

కొంతకాలంగా కేంద్రంతో తలపడేందుకు కేసీఆర్ సిధ్దమవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్, బీజేపీ మధ్య ఎలాంటి పరిస్థితి ఉందంటే ఢీ అంటే డీ అనే స్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో Samathamurthyవిగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీని చినజీయర్‌ స్వామి గొప్పగా కొనియాడారు. మోదీ పాలనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆయనను శ్రీరామచంద్రునితో పోల్చారు. ఈ విగ్రహావిష్కరణకు మోదీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరని కీర్తించారు. ఈ విషయం కేసీఆర్ కు కోపం తెప్పించిందనే ప్రచారం కూడా సాగుతుంది.

 రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతోపాటు వేడుకలు నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. దీంతో సఃమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లలేదనే ప్రచారం కూడా లేదు. సమతా మూర్తి విగ్రహావిష్కరణ ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని కేసీఆర్‌ కోసమే వాయిదా వేశారని ప్రచారం సాగింది. అయినా కేసీఆర్ శాంతికల్యాణానికి వెళ్లలేదు. 

యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు నిర్వహిస్తున్నారు.  యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చింది చినజీయర్ స్వామే. ఆలయ పున:నిర్మాణం అంతా ఆయన సూచనలు, సలహాలతోనే నిర్మించారు. Yadadri ఆలయ పున:నిర్మాణానికి ముగ్గు వేసిన చినజీయర్ స్వామి లేకుండానే ఉద్ఘాటన జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..