సీఎం కేసీఆర్ ఎక్కడ ఓటు వేయనున్నారంటే..

Published : Dec 06, 2018, 02:41 PM IST
సీఎం కేసీఆర్ ఎక్కడ ఓటు వేయనున్నారంటే..

సారాంశం

రేపే తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడింది. రేపే తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. మెదక్ జిల్లా సిద్ధిపేటలోని చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కేసీఆర్ ఓటు వేసే పోలింగ్ బూత్ ను, హెలిప్యాడ్ స్థలాలను పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ ఇవాళ పరిశీలించారు. చింతమడకలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు తరలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. అక్కడ ఉరుములతో వానలు, ఇక్కడ ఊపేస్తున్న ఉక్కపోత