కొండగట్టు బస్సు ప్రమాదం.. కేసీఆర్, చంద్రబాబు దిగ్భ్రాంతి

By sivanagaprasad KodatiFirst Published Sep 11, 2018, 1:19 PM IST
Highlights

జగిత్యాల జిల్లా కొండగట్టుపై జరిగిన రోడ్డు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం పట్ల, పలువురు తీవ్ర గాయాలపాలు కావడం పట్ల ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

జగిత్యాల జిల్లా కొండగట్టుపై జరిగిన రోడ్డు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం పట్ల, పలువురు తీవ్ర గాయాలపాలు కావడం పట్ల ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుపల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. గాయపడిన వారికి వెంటనే సరైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మరోవైపు బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వారిరువురు ఒక ప్రకటనలో తెలియజేశారు. రాంసాగర్ నుంచి జగిత్యాల వెళుతున్న బస్సు కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 30 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది.

click me!