టీ కాంగ్రెస్ నేతలు విభేదాలు వీడాలి.. మునుగోడు ప్రచారానికి రాహుల్ వెళ్లరు: కేసీ వేణుగోపాల్

By Sumanth KanukulaFirst Published Oct 22, 2022, 5:31 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభేదాలు వీడి ఐక్యంగా ఉండాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సూచించారు. అందరూ ఐక్యంగా ఉండి తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభేదాలు వీడి ఐక్యంగా ఉండాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సూచించారు. అందరూ ఐక్యంగా ఉండి తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రాహుల్ పాదయాత్ర తమిళనాడు, కర్ణాటక కంటే తెలంగాణలో ఎక్కువగా సక్సెస్ అవుతుందన్నారు. రేపు (అక్టోబర్ 2) ఉదయం 6 గంటలకు రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. దీపావళి సెలవుల తర్వాత తెలంగాణలో 11 రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతుందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి రాహుల్ గాంధీ వెళ్లరని స్పష్టం చేశారు. 

ఇక, కర్ణాటక నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా నది బ్రిడ్జిపై రాగానే తెలంగాణలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. అక్కడ రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సిద్దమవుతున్నారు. అక్కడి నుంచి దాదాపు 4 కి.మీ మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది. అనంతరం రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరి వెళతారు. 

దీపావళి సందర్భంగా  అక్టోబర్ 24,25 తేదీల్లో, కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ సందర్భంగా అక్టోబర్ 26వ తేదీన రాహుల్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాహుల్ పాల్గొనున్నారు. అక్టోబర్ 26వ తేదీ రాత్రికి రాహుల్ గాంధీ తిరిగి తెలంగాణకు చేరుకుంటారు. 27వ తేదీ నుంచి 11 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. భారత్ జోడో యాత్ర నవంబర్ 1 న శంషాబాద్ మీదుగా హైదరాబాద్‌లోకి ప్రవేశించనుంది. నవంబర్ 7వ తేదీ వరకు రాహుల్ పాదయాత్ర తెలంగాణలో కొసాగనుంది. 

click me!