దసరా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..

By telugu teamFirst Published Oct 16, 2021, 7:16 PM IST
Highlights

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్ర, శనివారాల్లో నిజామాబాద్‌లో పర్యటించి పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంకపూర్‌లో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కుటుంబాన్ని, సుభాశ్ నగర్‌లో భాగా రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.
 

హైదరాబాద్: Nizamabadలో పర్యటిస్తున్న MLC కల్వకుంట్ల కవిత శుక్ర, శనివారాల్లో జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. Dasara పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ Kavitha ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం, పాలపిట్ల దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత, భర్త అనిల్‌లు వాహనపూజ, ఆయుధ పూజ చేశారు. రామాలయంలో జరిగిన జమ్మి పూజలో ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు పాల్గొన్నారు. అటు నుంచి నిజామాబాద్ కంఠేశ్వర్ పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన బాణా సంచా విన్యాసాలను తిలకించడానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, గత తొమ్మిది రోజులుగా జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం సంతోషకరమని, ఈ పండుగ అందరికీ ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. కరోనా కారణంగా రెండేళ్లు దసరా వేడుకలను జరుపుకోలేదని తెలిపారు. నిజామాబాద్‌లో దసరా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. నిజామాబాద్ ప్రజల కోరికలు తీరాలని, వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మేయర్ నీతూ కిరణ్, మహిళా కమిషన్ సబ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: తెలంగాణకు దేశ విదేశాల కంపనీలు.. పెట్టుబడులకు కేంద్రస్థానమిదే: ఎమ్మెల్సీ కవిత

కాగా, ఈ రోజు అంకపూర్‌లో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కుటుంబాన్ని, సుభాశ్ నగర్‌లో భాగా రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వచ్చిన నేతలు, కార్యకర్తలను కలిశారు.

click me!