రేపు కాంగ్రెస్‌లోకి కత్తి కార్తీక: మాణికం ఠాగూర్ సమక్షంలో చేరిక

By narsimha lode  |  First Published Jul 15, 2022, 12:34 PM IST

ఈ నెల 16న కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. గతంలో ఆమె దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 


హైదరాబాద్: కత్తి కార్తీక  ఈ నెల 16న Congress పార్టీలో చేర‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జీ Manickam Tagore  పీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 

 సీఎల్పీ నాయ‌కులు భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు, ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్  మ‌ధు యాష్కీ గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు స‌మ‌క్షంలో గాంధీ భ‌వ‌న్ లో రేపు 11 గంట‌ల స‌మ‌యంలో చేర‌బోతున్నారు.

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున kathi karthika పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో  కత్తి కార్తీకకు 636ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 554 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధి నాగరాజుకు 3570 ఓట్లు దక్కాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. సోలిపేల రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా చివరి నిమిషంలో టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రభావం చూపలేకపోయారు. ఓ తెలుగు టీవీ చానెల్ లో నిర్వహించిన కార్యక్రమంతో పాటు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా కత్తి కార్తీక తెలుగు ప్రజలకు చేరువయ్యారు. తెలంగాణ యాసలో ప్రముఖ టీవీ చానెల్ లో ఆమె నిర్వహించిన ఇంటర్వ్యూలు ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. 

click me!