టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్.. చంద్రబాబు కీలక నిర్ణయం

Siva Kodati |  
Published : Nov 04, 2022, 06:41 PM IST
టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్.. చంద్రబాబు కీలక నిర్ణయం

సారాంశం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమితులయ్యారు. నిన్నటి వరకు టీటీడీపీ అధ్యక్షుడిగా వున్న బక్కని నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు చంద్రబాబు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి వరకు టీటీడీపీ అధ్యక్షుడిగా వున్న బక్కని నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు చంద్రబాబు . ఈ నెల 10న టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ALso REad:తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

కాగా... తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రెసిడెంట్‌గా వున్న కాసాని జ్ఞానేశ్వర్ అక్టోబర్ 15న టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను తెలుగుదేశం నేషనల్ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత  జ్ఞానేశ్వర్‌కు పార్టీ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీలో చేరిన కాసాని 2018లో తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన గతంలో శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు. రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్మన్ గా పని చేసిన అనుభవం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!