అభిమాన నేత ఓటమి...వేలు నరుక్కున్న అభిమాని

sivanagaprasad kodati |  
Published : Dec 13, 2018, 08:42 AM IST
అభిమాన నేత ఓటమి...వేలు నరుక్కున్న అభిమాని

సారాంశం

తను ఎంతో అభిమానించే నేత ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని వేలు నరుక్కున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందిన మల్లేష్ అనే యువకుడు... గండ్ర సత్యానారాయణరావు (సత్తెన్న)కు వీరాభిమాని. 

తను ఎంతో అభిమానించే నేత ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని వేలు నరుక్కున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందిన మల్లేష్ అనే యువకుడు... గండ్ర సత్యానారాయణరావు (సత్తెన్న)కు వీరాభిమాని. ఈ క్రమంలో గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి అలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ అభ్యర్థిగా గండ్ర పోటీ చేశాడు.

ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. గండ్ర వీరాభిమాని కావడంతో మల్లేశ్ ఆయన పేరుతో ఉన్న టీషర్టు వేసుకుని గ్రామంలో తిరుగుతున్నాడు. ఓడిపోయిన వ్యక్తి టీ షర్ట్ వేసుకుని తిరుగుతున్నావా అంటూ ఇతర పార్టీలకు చెందిన యువకులు గెలిచేశారు.

ఓడినా, గెలిచినా తాను సత్తెన్న అభిమానినని, ఆయన కోసం ఏమైనా చేస్తానన్నాడు. వారు అన్న మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన మల్లేశ్ ఇంటికి వచ్చి గొడ్డలితో ఎడమ చేతి వేలిని నరుక్కున్నాడు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు స్థానిక వైద్యుడితో చికిత్స చేయించారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?